హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ లో బోనాలు షురూ

 హైదరాబాద్‌ జులై 7, (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌ పాత బస్తీలో బోనాలు ప్రారంభమయ్యాయి.   లాల్‌ దర్వాజలోని సింహవాహిని మహాంకాళీ అమ్మవారి శిఖర పూజా , ద్వజారోహనం తో  పాత బస్తి లో  బోనాల సందడి మొదలయింది. శుక్రవారం జరిగిన శిఖర పూజ లో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సివి ఆనంద్‌, జిహెచ్‌ఎంసి జోనల్‌ కమిషనర్‌ వెంకన్న,సౌత్‌ జూన్‌ డిసిపి సాయి చేతన్య తదితరులు పాల్గోన్నారు. 

  ఓల్డ్‌ సిటీ లో జూలై 16న బోనాలు, జూలై 17 న భవిష్యవాణి ( రంగం ) కార్యక్రమం జరుగుతాయి. సీనీ సివి ఆనంద్‌ మాట్లాడుతూ  ప్రతి ఏడాది ఆనవాయితీగా శిఖర పూజలో పాల్గొనడం సంతోషంగా ఉంది.  ఓల్డ్‌ సిటీ బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....