హైదరాబాద్‌లో ‘సెల్ఫిష్‌’ సినిమా షూటింగ్‌

ఆశిష్‌, కాశీ విశాల్‌, దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌‘సెల్ఫిష్‌’ నుంచి చైత్ర గా ఇవానా పరిచయం  తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్‌’తో ఆకట్టుకున్న యంగ్‌ హీరో ఆశిష్‌ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్‌ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ , ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మిస్తున్న యూత్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెల్ఫిష్‌’ తో వస్తున్నాడు. ఇందులో ఆశిష్‌ మాస్‌ క్యారెక్టర్‌లో నటిస్తు న్నాడు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లలో రెక్లెస్‌ యాటిట్యుడ్‌ చూపించాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్నా ఇవానా ను చైత్ర పాత్రలో పరిచయం చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇవానా ఎదో ఆందోళనలో వున్నట్లుగా కనిపించగా.. ఆశిష్‌ ఆమెని తదేకంగా చూస్తునట్లుగా కనిపించారు.ఐడీ కార్డ్‌ సూచించినట్లుగా ఇవానా ఇందులో ఫైనాన్సియల్‌ ఎనలిస్ట్‌ గా కనిపిస్తుంది. పోస్టర్‌లో ఇవానా సింపుల్‌గా కనిపించింది. ఆశిష్‌ గిరజాల జుట్టు, గడ్డంతో మోడిష్‌గా కనిపిస్తున్నాడు.రిజర్వడ్‌ ఫర్‌ మై లవ్‌ అనే గూగుల్‌ సెర్చ్‌ స్పేష్‌ కనిపిస్తోంది. ఈ కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్‌ సెల్ఫిష్‌ ఓల్డ్‌ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి.  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్‌ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్‌ మణికంధన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్‌ లిరిక్‌ రైటర్‌. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌, కిరణ్‌ కుమార్‌ మన్నె ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్ఫిష్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....