హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ): ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన భాగ్యనగర వాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బాలానగర్‌, బోయిన్‌పల్లి, సనత్‌నగర్‌, చింతల్‌లోనూ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మణికొండ, మెహిదీపట్నంతో పాటు మేడిపల్లి, ఉప్పల్‌, రామంతాపూర్‌లో కూడా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు  జలమయమయ్యాయి. పలు చోట్ల డ్రైనేజీలు  పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు నిలిచి పోవడంతో వాహనదారులు  ఇబ్బందులు  పడ్డారు. ఇటు  పాతనగరంలోని పలు చోట్ల తొలకరి జల్లులు పడ్డాయి.వర్షం కారణంగా గౌలిపురా,లాల్ దర్వాజ,ఉప్పుగూడ ,కందికల్ గేట్,ఛత్రినాక, లలితాబాగ్,పటేల్ నగర్, అంబికా నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారమే కాదు గురువారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....