హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద విధ్వంసం

వర్షాలు వళ్ళ ఇప్పటివరకు 28 మంది మృతి

భారీ వర్షాల కారణంగా వరదల్లో కొట్టుకుపోయిన అనేక కార్లు

24 గంటలు భారీ వర్షాలు..ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి

ఈటానగర్‌ జూలై 10 , (ఇయ్యాల తెలంగాణ ): ఎడతెరిపి లేని వర్షాలు హిమాచల్‌ ప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగడంతో వరద బీభత్సం సృష్టిస్తోంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమై ఐదుగురు మృతి చెందారు. వరద బీభిత్సం, కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విధ్వంసం సృష్టించాయి. కులు జిల్లాలోని కసోల్‌ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో అనేక కార్లు కొట్టుకుపోయాయి.భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకూతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తెడంతో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటలపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు మాట్లాడుతూ రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. అలాగే మూడు హెల్ప్‌ లైన్‌ నంబర్లను కూడా ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 1100, 1070, 1077 నంబర్లకు ఫోన్‌ చేయాలాని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌, ఉనా జిల్లాలో అత్యధికంగా 17 సెంటీ విూటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ముడిలో 12 సెంటీ విూటర్లు, సిమ్లాలో 9 సెంటీ విూటర్లు, ధర్మశాలలో 9 సెంటీ విూటర్ల వర్షపాతం నమోదైంది.మరోవైపు భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం వణికిపోతోంది. కొండచరియలు విరిగిపడటం, వరద బీభత్సంతో భారీ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేశారు. 1982 తర్వాత ఢల్లీిలో జూలైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. యమునా నది నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రతమ్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాల కారణంగా ఢల్లీి, గురుగ్రామ్‌, నోయిడా, ఎన్‌సిఆర్‌లలో పాఠశాలలు మూసివేశారు.హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీవర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వికాస్‌నగర్‌ సవిూపంలో హిమాచల్‌ ప్రదేశ్‌ రోడ్‌వేస్‌ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికుల సాయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వరద కాలువలో చిక్కుపోయిన దృశ్యాలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....