‘హాయ్‌ నాన్న’ First Single సమయమా పాట విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని, మృణాల్‌ ఠాకూర్‌, శౌర్యువ్‌, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘హాయ్‌ నాన్న’ ఫస్ట్‌ సింగిల్‌ సమయమా పాట విడుదల  నేచురల్‌ స్టార్‌ నాని హోల్సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్నా’ మేకర్స్‌ నిన్న ఫస్ట్‌ సింగిల్‌ సమయమా ప్రోమోతో అలరించారు. ఈ రోజు, ఇష్టమైన వారందరికీ కోసం పాడుకునే పాటగా ఉండబోతున్న లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.సమయమా మనసుని ఆకట్టుకునే మోడ్రన్‌ టచ్‌ వున్న బ్యూటీఫుల్‌ సాంగ్‌. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ తన ఎక్సయిట్మెంట్‌ ని ఆపుకోలేని హీరో కథని చెబుతూ, తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. ఆర్కెస్ట్రేషన్‌, బేస్‌ ట్రాక్‌ గిటార్‌ బీట్స్‌ ఎక్స్‌ టార్డినరిగా వున్నాయి. ట్యూన్‌, ప్రొగ్రషన్‌ కట్టిపడేస్తున్నాయి. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించారు. నాని, మృణాల్‌ ఠాకూర్‌ అద్భుతమైన కెమిస్ట్రీతో విజువల్స్‌ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానిన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్‌ చెరుకూరి (అపఓ), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ చిత్రానికి సాను జాన్‌ వరుగీస్‌ ఎూఅ సినిమాటోగ్రఫర్‌ గా పని చేస్తున్నారు. ప్రవీణ్‌ ఆంథోని ఎడిటర్‌ గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా, సతీష్‌ ఈవీవీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా పని చేస్తున్నారు. 

’హాయ్‌ నాన్న’ ఈ ఏడాది డిసెంబర్‌ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా ఖన్నా

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....