హర్యానాలో విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు

హర్యానాలో  విద్యాసంస్థలు  తెరిచేందుకు కసరత్తు



షిప్టు పద్దతిలో స్కూళ్లు నడిపిస్తామంటున్న ప్రభుత్వం



చంఢీగడ్‌,జూన్‌4 (ఇయ్యాల తెలంగాణ):  హర్యానా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దశల  వారీగా విద్యాసంస్థలను తెరిచేందుకు తాము ఒక ప్రణాళికను రూపొందించామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కన్వర్‌ పాల్‌ చెప్పారు. ముందుగా 10, 11, 12వ తరగతి విద్యార్థుల కోసం స్కూళ్లు ప్రారంభిస్తామని, ఆ తర్వాత దశవారీగా 6 నుంచి 9, 1 నుంచి 5 తరగతులను తెరుస్తామన్నారు.  అయితే 50 శాతం సామర్థ్యంతోనే పాఠశాలు నడిపేందుకు అనుమతిస్తామన్నారు.  అంటే ఒక తరగతిలో 30 మంది ఉంటే.. 15 మందికి ఒకపూట, మిగతా 15 మందికి మరోపూట లేదా మరో రోజు తరగతులు  నిర్వహించేలా పాఠశాలలను ఆదేశిస్తామని మంత్రి వెల్లడించారు. ఇక డిగ్రీ కాలేజీలను కూడా ఆగస్టు నుంచి ప్రారంభిస్తామని హర్యానా విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఆగస్టులో ఫస్టియర్‌ తరగతులు  ప్రారంభమవుతాయని, సెకండియర్‌ తరగతులను సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. విద్యాసంస్థల  పునఃప్రారంభానికి అవసరమైన మరిన్ని నిర్ణయాలను యూనివర్సిటీలు  తీసుకుంటాయని మంత్రి వెల్లడించారు.     అదేవిధంగా వాయిదాపడ్డ 12వ తరగతి ఫైనల్ ‌ పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నామని, పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న హరియాణా విద్యాశాఖ మంత్రి కన్వర్‌ పాల్‌
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....