హయత్‌ ప్లేస్‌ హోటల్‌ ను ప్రారంభించిన సీఎం జగన్‌

విజయవాడ ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ ; ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో హయత్‌ ప్లేస్‌ హోటల్ను సీఎం  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హయత్‌ ఛైర్మన్‌ వీరస్వామి, హయత్‌ ఇంటర్నేషనల్‌ ఏరియా ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌,  మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌,  ఈ ప్రాజెక్టులో మమేకమైన అందరికీ హృదయపూర్వక అభినందనలు. విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌, ప్రముఖ హోటల్స్‌ వచ్చి… ఆంధ్రరాష్ట్రం కూడా గ్లోబల్‌ ఫ్లాట్ఫాంవిూద,  ప్రపంచ పర్యాటక మ్యాప్లో ఒక ప్రత్యేకమైన స్ధానం పొందాలని కోరుకుంటునానని అన్నారు.  మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చాం. మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా, మంచి చైన్‌ హోటల్స్ను కూడా ప్రోత్సహిస్తూ వచ్చామని అన్నారు.ఒబెరాయ్తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్‌ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక మ్యాప్లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరికీ ఇలాంటి ప్రోత్సహకాలిచ్చి ఏపీని వరల్డ్‌ టూరిజం మ్యాప్లో పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రభుత్వం  సిద్ధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌,  హోటల్‌ హయత్‌ ప్లేస్‌ ఛైర్మన్‌ ఆర్‌ వీరా స్వామి, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....