స్వల్పంగా తగ్గిన వాణిజ్య GAS సిలిండర్‌ ధర

న్యూఢల్లీ ఆగష్టు 1 (ఇయ్యాల తెలంగాణ ): వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న వంటగ్యాస్‌ సిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం 14 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ హైదరాబాద్‌లో రూ.1155కు లభిస్తున్నది.తాగా తగ్గిన ధరలతో ఢల్లీిలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1680కు చేరింది. కోల్‌కతాలో రూ.1802.50, ముంబైలో రూ.1640.50, చెన్నైలో రూ.1852.50గా ఉన్నది. కాగా, జూలై నెల ఆరంభంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.7 మేర పెరిగిన విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....