స్వగ్రామాలకు చేరుకున్న సైనికుల మృతదేహాలు

గన్నవరం జులై 1 (ఇయ్యాల తెలంగాణ ): లఢఖ్‌ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ముగ్గురు మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాస్తవాధీన రేఖ సవిూపంలో టి`72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేప్కు 148 కి.విూ. దూరంలో శనివారం మంచు కరిగి శ్యోక్‌ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతిచెందారు.  ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారుబాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్‌ కు చెందిన సుభాన్‌ ఖాన్‌ కూడా మరణించారు. ఇతను 17ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్‌ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంపూర్‌ లో సుమారు 100ఇండ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులు సెలక్ట్‌ అయ్యారు. వీరిలో కొందరు రిటైర్డ్‌ అయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....