స్పందించిన మానవత్వం

కొత్తగూడెం జులై 10,(ఇయ్యాల తెలంగాణ ): లక్ష్మీదేవిపల్లి మండలం హమాలి కాలనీ గ్రామానికి చెందిన చవాన్‌ సుభాష్‌, కొలి సమ్మయ్యలు చతీష్‌ గడ్‌ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలపాలయ్యారు. ఇద్దరు ప్రాణాపాయస్థితిలో వీరికి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన ఆత్మ కమిటీ డైరెక్టర్‌ శేషాద్రి వినోద్‌ తన మిత్రులైన రామకృష్ణ, యంజె రాజు, ప్రణయ్‌ కుమార్‌ లతో కలిసి  వారి వారి మిత్రుల ద్వారా కొంత మొత్తాన్ని సవిూకరించారు. ఖమ్మం కిమ్స్‌ హాస్పిటల్‌, మమత హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన ఆత్మ కమిటీ డైరెక్టర్‌ శేషాద్రి వినోద్‌, కో ఆప్షన్‌ సభ్యులు జక్కుల సుందర్‌, తాళ్ళపల్లి రాజు(ఎంజేఆర్‌), రామకృష్ణ (ఆర్కె), ప్రణయ్‌ కుమార్‌ (గున్ను) బాధితులకు 40 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు అడిగిన వెంటనే బాధితుల కోసం మంచి మనసుతో ముందుకు వచ్చి సహాయం చేసిన శ్రేయోభిలాషులకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపి రాబోయే రోజుల్లో బాధితులకు మరికొంత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....