సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్న చిరుత మరో వీడియో

సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్న చిరుత మరో వీడియో

ఎక్కడుందో గుర్తించాలంటూ స్థానికుల ఆవేదన


హైదరాబాద్ మే 16  (ఇయ్యాల తెలంగాణ)   నగరంలోని మైలార్ దేవుల్ పల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుత శంషాబాద్ నుంచి జారుకుందని తెలియ జేసినా ఇప్పుడు మల్లి సోషల్ మీడియా లో చిరుత వీడియో వైరల్ అవుతోంది. ఒక లారీ డ్రైవర్ ను వెంటాడిన చిరుత లారీ డ్రైవర్ పరుగు పరుగున లారీలోకి వెళ్లి దాసుకోగా సుమారు 10 కుక్కలు చిరుతను తరుముతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అటవీ శాఖా అధికారులు భయాందోళనలు వద్దు చిరుత గురుంచి పూర్తిగా పరిశీలనలు జరిపామ్ అని ప్రకటిస్తున్న అధికారులు మరో పక్క చిరుత భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలు అది ఏ మూలాన దాక్కుందో తేలియక అందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ చిరుత గురుంచి అధికారులు ఎం చెబుతున్నారంటే.. 

నగరం లోని మైలార్ దేవుల్ పల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుత పులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లి పోయిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు చిరుత జాడ కోసం  అధికారులు నానా హైరానా పడ్డారు. గురువారం ప్రారంభమైన ఆపరేషన్ శుక్రవారం కూడా కొనసాగింది. శంషాబాద్ సమీపంలో ఒక ప్రయివేట్ వ్యవసాయ క్షేత్రంలో జల్లెడ పట్టిన అధికారులు చిరుత జాడలను పాదముద్రల సహకారంతో గుర్తించారు. అది తిరిగిన ప్రాంతాల ఆధారంగా రెండు రోజులుగా గుర్తించే ప్రయత్నం చేశారు. పోలీసు శాఖా సహాయం తీసుకున్న అటవీ శాఖా అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శోదించారు. డ్రోన్ కెమెరాలను సిసి కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. చివరకు చిరుత పాద ముద్రలను ఫామ్ హౌస్ లో గుర్తించిన అధికారులు పోలీసుల డాగ్ స్క్యాడ్ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో  తేల్చారు. గురువారం రోజంతా అక్కడే ఉండి   రాత్రి అగ్రికల్టెర్ యూనివర్సిటీ మీదుగా చిలుకూరు  అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మళ్ళీ ఆహారం కోసం అక్కడకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అటవీ శాఖా అధికారులు దానిని బంధించేందుకు అవసరమైన        బోనులను,సిసి కెమెరాలను కొనసాగించాలని నిర్ణయించారు.  అలాగే తగిన చర్యలు తీసుకోవడం తో పాటు చిలుకూరు అటవీ ప్రాంతంలో నిత్యం నిఘా పెడతామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కావున అధికారులు చిరుత జాడను కాదు అది ఎక్కడుందో గుర్తించండి అంటూ జనాలు కోరుతున్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....