సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అన్వేషి’ టీజర్‌ విడుదల

ఓ యువకుడు డిటెక్టివ్‌ కావాలనుకుంటాడు. అదే సమయంలో ప్రేమలో పడతాడు. నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. రాత్రి సమయంలో మారేడు కోన అనే ప్రాంతానికి రాకపోకలు నిషేధం. అలాంటి ఊరికి హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది!. అసలు మారేడు కోనకు, మా కథకు ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘అన్వేషి’ సినిమా చూడాల్సిందే నంటున్నారు నిర్మాత టి.గణపతి రెడ్డి.విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్‌ అండ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అన్వేషి’. అరుణ  శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను సోమవారం ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు లాంచ్‌ చేశారు. టీజర్‌ను గమనిస్తే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ చాలానే ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు హీరో డిటెక్టివ్‌ కావాలనుకుంటాడు. అయితే అనుకోని కారణాలతో తను మారేడు కోనకు వెళ్లాల్సి వస్తుంది. అసలు నిజంగానే ఆత్మలున్నాయా? అనే కోణంలో అన్వేషి సినిమా ఆసక్తికరమైన కథాంశంతో రూపొందినట్లు సన్నివేశాలను చూస్తే స్పష్టమవుతుంది. విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల పాత్రలను దర్శకుడు వి.జె.ఖన్నా ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తుంది. చైతన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌, సైమన్‌ కింగ్‌ బీజీఎం, కె.కె.రావు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాతగా అన్వేషి నా తొలి చిత్రం. లవ్‌ అండ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించాం. మా డైరెక్టర్‌ వి.జె.ఖన్నా మంచి కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోపెడతాయి. షూటింగ్‌ అంతా పూర్తయ్యింది.  హీరో విజయ్‌, హీరోయిన్స్‌ సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల అద్భుతంగా నటించారు. చైతన్‌ భరద్వాజ్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే సైమన్‌ కింగ్‌గారి బీజీఎం హైలైట్‌గా ఉంటుంది.  మా బ్యానర్‌కు అన్వేషి మంచి హిట్‌ అయ్యి మైల్‌ స్టోన్‌ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. 

నటీనటులు:

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల, అజయ్‌ ఘోష్‌, నాగి, హరి కృష్ణ (గృహ లక్ష్మి), ప్రభు, దిల్‌ రమేష్‌, చంద్ర శేఖర్‌ రెడ్డి, రచ్చ రవి, మిమిక్రీ సుబ్బరావు, ఇమ్మాన్యుయేల్‌, జబర్దస్త్‌ సత్య తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....