సెప్టెంబర్‌ 9న జాతీయ లోక్‌ అదాలత్‌

జగిత్యాల ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ ):జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జగిత్యాల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టులలో 9 సెప్టెంబర్‌ 2023 రోజున జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందనిజిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్‌ జగిత్యాల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు..ఈ జాతీయ జాతీయ లోక్‌ అదాలత్‌ లో రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు (దావాలు), కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, మోటార్‌ వాహన చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, చిట్‌ ఫండ్‌ కేసులు ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడునని కావున కచ్చిదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 9 సెప్టెంబర్‌ 2023 రోజున నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలతో విూ యొక్క కేసులు పరిష్కరించుకోగలరని జిల్లా న్యాయమూర్తి నీలిమ కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....