సనత్ నగర్, ఏప్రిల్ 6 (ఇయ్యాల తెలంగాణ) : సీతారాముల కళ్యాణం సనత్ నగర్ పరివార్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు, బిజేవైఎం కర్ణాటక ఇంచార్జి ఆకుల విజయ అన్నారు. శ్రీ రామ నవమి వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరిగే సీతా రాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని, సనత్ నగర్ పరివార్ ఆధ్వర్యంలో కూడా వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కుల,మతాలకు అతీతంగా శ్రీరామ నవమి వేడుకల్లో అందరూ పాల్గొనాలని ఆకుల విజయ పిలుపునిచ్చారు. సనత్ నగర్ పరివార్ నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సీతారాముల అనుగ్రహాన్ని పొందాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే శ్రీ రామ నవమి వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బీజేపీ చేసిన కృషిని, మోడీ సేవలను ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయోధ్యలో దివ్య, భవ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నశుభ సందర్భంలో అత్యంత ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
అనంతరం సీతారాముల కల్యాణ ఉత్సవాలకు సంబందించిన గోడ పత్రికను సనత్ నగర్ పరివార్ సభ్యులతో కలసి విడుదల చేశారు. ఈ నెల 10 వ తేదీ శ్రీరామ నవమి రోజున అమీర్ పేట ధరం కరం రోడ్డులోని శ్రీ గరు గోవింద్ క్రీడా ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆకుల విజయ పేర్కొన్నారు. ఈ మహోన్నత శుభ కళ్యాణ కార్యక్రమం శ్రీ శివ క్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మ దేవత బిరుదాంకీతులు,హిందూ ధర్మ పరిరక్షకులు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ ఆశీస్సులతో కార్యక్రమం కొన సాగుతుందని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ రామ నవమి వేడుకలు సనత్ నగర్ పరివార్ ఆధ్వర్యంలో 10వ తేదీ ఉదయం 7గంటల 30 నిమిషాలకు గోపూజతో ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు వరుసగా గణపతి పూజా, పూణ్యా హవాచన పంచ గవ్య ప్రాసన, గణపతి హోమం, శ్రీ సీతారాముల వారి కళ్యాణం, అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో ముగుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నూతన దంపతులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో యేచన్ సురేష్, తాళ్ళ జైహింద్ గౌడ్, ఉత్తమ్ రాజ్ పురోహిత్, విఠల్, చరణ్ సింగ్, ఆకునూరి శ్రీనివాస్, దళిత రత్న అవార్డు గ్రహీత పొలీమేర్ సంతోష్ కుమార్, వై శ్రీనివాస్, సుధీర్ ముదిరిజ్, సానీ సుధాకర్, తేజా, ఆకుల సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, మల్లీఖార్జున్, తదితరులు పాల్గొన్నారు.