సీటింగ్‌ అకామడేషన్‌ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్‌ స్కీమ్‌

న్యూఢల్లీ జూలై 8,(ఇయ్యాల తెలంగాణ ): రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్‌ అకామడేషన్‌ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది. రైళ్లలో వసతులు సాధ్యమైనంత ఎక్కువగా వినియోగమయ్యే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఇటువంటి ఏసీ రైళ్ల ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్‌ ఆఫర్‌ వెంటనే అమల్లోకి వస్తుందని, అయితే ఇప్పటికే టిక్కెట్లను బుక్‌ చేసుకున్నవారికి ఈ ఆఫర్‌ వర్తించదని, ఎటువంటి తిరిగి చెల్లింపులు ఉండబోవని వివరించింది.

డిస్కౌంట్‌ పథకం వివరాలు :

` ఏసీ చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాసెస్‌కు మాత్రమే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. అనుభూతి, విస్టాడోమ్‌ బోగీలు ఉన్న రైళ్లు సహా ఏసీ సిట్టింగ్‌ అకామడేషన్‌ ఉన్న అన్ని రైళ్లకూ వర్తిస్తుంది.

` టిక్కెట్‌ మూల ఛార్జీలో గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్‌ ప్రయాణికునికి లభిస్తుంది. అయితే రిజర్వేషన్‌ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్‌ ఛార్జీలు, జీఎస్‌టీ వేర్వేరుగా విధిస్తారు.

` వందే భారత్‌ రైళ్లలో గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో బేస్‌ ఫేర్‌ (మూల ఛార్జీ)పై గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

` ఈ డిస్కౌంట్‌ పథకం గరిష్ఠంగా ఆరు నెలలపాటు అమలవుతుంది. డిమాండ్‌నుబట్టి నెలవారీ లేదా సీజనల్‌ లేదా వారాంతపు రోజులు ఈ పథకం అమలవుతుంది.

` ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ ఆధారంగా ఈ పథకాన్ని సవిూక్షించి, పొడిగించడమా? ఉపసంహరించడమా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.

` సెలవులు, పండుగల సమయంలో నడిపే ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించద

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....