మంథని జులై 10,(ఇయ్యాల తెలంగాణ ): వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోనీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోని అప్రమత్తంగా ఉండాలని మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ సూచించారు.సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని పలు వీధులను మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్ సందర్శించి పరిశీలించారు. పోచమ్మ వాడలో మిషన్ భగీరథ లైను పనులను పర్యవేక్షించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నీటి సమస్య ఉండడంతో విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉందని మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి లక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కు తెలియజేయగా ఆమె వెంటనే స్పందించి వైస్ చైర్మన్ అరేపెల్లి కుమార్ ను పాఠశాలకు పంపించి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అందులో భాగంగానే ఆయన పాఠశాలను సందర్శించి నూతన భవనాన్ని, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హావిూ ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- General News
- సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Leave a Comment