సిరిసిల్ల లో పర్యటించిన కెటిఆర్
రాజన్న సిరిసిల్ల ,మే19 (ఇయ్యాల తెలంగాణ ):: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లెల్ల నుంచి ముస్తాబాద్ మధ్యలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, అధికారులు , పలువురు నాయకులు పాల్గొన్నారు. ముస్తాబాద్ సెస్ నూతన భవనాన్ని, పోతుగల్ ` గండిలచ్చాపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన వంతెనను, కొండాపూర్ ` నారాయణపూర్ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల లో అధికారులతో కేటీఆర్ సమావేశమై పలు అంశాల
పై చర్చించారు.