సిద్ధార్థ్‌ రాయ్‌’ టీమ్‌ ని అభినందించిన స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌

’సిద్ధార్థ్‌ రాయ్‌’ చిత్రం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ గా హెడ్‌ లైన్స్‌ లో నిలిచింది. పాపులర్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌  దీపక్‌ సరోజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌ కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది.తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ టీమ్‌ ని అభినందించారు. దీపక్‌ సరోజ్‌, దర్శకుడు వి యశస్వీ ని పుష్ప2 సెట్స్‌ కి ఆహ్వానించిన సుకుమార్‌ తన బెస్ట్‌ విషెస్‌ అందించారు. టీజర్‌ తనకి చాలా నచ్చిందని, కంటెంట్‌ యూనిక్‌ గా వుందని ప్రశంసించారు సుకుమార్‌.టీజర్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ చిత్రానికి బిజినెస్‌ పరంగా బయ్యర్ల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి.శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌, విహాన్‌ డ విహిన్‌ క్రియేషన్స్‌ పతాకాలపై ప్రొడక్షన్‌ నెం 1గా జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రంలో  ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రధన్‌ సంగీతం అందిస్తుండగా, సామ్‌ కె నాయుడు కెమెరా మెన్‌ గా, ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌ గా పని చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....