సిటీ బస్సులకోసం నిరీక్షణ

విజయవాడ జులై 24, (ఇయ్యాల తెలంగాణ ):ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది. సోమవారం ఉదయం అమరావతి లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించారు. దాంతో విజయవాడ సిటీలో బస్సులు కోసం ప్రజలకు  పడిగాపులుతప్పలేదు. విజయవాడ బస్టాండ్‌ లో సిటీ బస్సుల కోసం ఎదురుచూపులు చూసారు. సిటీ బస్సుల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాసారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే వాళ్లు, ఇతర ప్రయాణికులకు  బస్సుల కోసం సుధీర్ఘ నిరీక్షణ తప్పలేదు. కనీసం బస్సులు ఎప్పుడు వస్తాయో కూడా  ఆర్టీసీ అధికారులు చెప్పలేకపోయారు. బస్సు ఎప్పుడు వస్తున్నాయిని అడుగుతున్నప్రయాణికకనసమాధానం చెప్పకుండా దాటవేసారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....