’’సికిందర్‌’’లో సల్మాన్‌ ఖాన్‌ జోడిగా Star Heroine రశ్మిక

’’సికిందర్‌’’లో సల్మాన్‌ ఖాన్‌ జోడిగా అవకాశం దక్కించుకున్న స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న

స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న వరుస అవకాశాలతో పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా రశ్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్‌ దక్కుతున్నాయి. యానిమల్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలీవుడ్‌ లో క్రేజీ హీరోయిన్‌ గా మారింది రశ్మిక మందన్న. ఆమె తాజాగా మరో బిగ్గెస్ట్‌ మూవీ దక్కించుకుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ రూపొందిస్తున్న సికిందర్‌ సినిమాలో రశ్మిక హీరోయిన్‌ గా ఎంపికైంది. మేకర్స్‌ ఈ విషయాన్ని ఈ రోజు అనౌన్స్‌ చేశారు.

సికిందర్‌ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ జోడిగా నటించేందుకు రశ్మిక మందన్నకు అహ్వానం పలుకుతున్నాం. ఈ జంట ఆన్‌ స్క్రీన్‌ మ్యాజిక్‌ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్‌ పండక్కి తెరపై సల్మాన్‌, రశ్మిక జంట తెరపైకి వస్తారు. అంటూ సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సినిమా దక్కడంపై రశ్మిక మంందన్న ఇన్‌ స్టాగ్రామ్‌ లో స్పందించింది. నా నెక్ట్‌ మూవీ అప్డేట్‌ చెప్పమని ఫ్యాన్స్‌ తరుచూ అడుగుతుంటారు. సల్మాన్‌ సరసన సికిందర్‌ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. అని పోస్ట్‌ చేసింది.

ప్రస్తుతం పుష్ప 2  షూటింగ్‌ లో ఉన్న రశ్మిక ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్‌ విూద మ్యాజిక్‌ చేయబోతోంది. ఆమె గర్ల్‌ ఫ్రెండ్‌ అనే ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీలోనూ నటిస్తోంది. రశ్మిక అందుకుంటున్న అవకాశాలు చూస్తుంటే ప్రస్తుతం ఆమె బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా హీరోయిన్‌ అనుకోవచ్చు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....