సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై సర్వత్రా ఆందోళన

బైకు రేసుపై హెచ్చరిద్దామనుకున్నా: నరేశ్‌

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సినీ పరిశ్రమ ఉలిక్కి పడిరది. ఈ ప్రమాదంపై పలువురు టాలీవుడ్‌ పెద్దలు, సీనియర్‌, జూనియర్‌ హీరోలు స్పందించారు. ఇప్పటికే పలువురు పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్‌ విూడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటుడు నరేష్‌ కూడా సాయితేజ్‌ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. ’సాయి, మా అబ్బాయి నవీన్‌ ఇద్దరూ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. నిన్న సాయంత్రం ఇక్కడి నుంచే వెళ్ళారు. నేను ఆ బైక్‌ సౌండ్స్‌ విని వెళ్ళేలోపే బయల్దేరిపోయారు. బైక్‌ రైడిరగ్‌ చేయొద్దని సాయి తేజ్‌ను చాలా సార్లు హెచ్చరించాను. నేను ఎంత చెప్పినా నా మాటలు పట్టించుకోలేదు. తేజ్‌, మా అబ్బాయి కలిసి రైడిరగ్‌ చేస్తారు. రైడిరగ్‌పై ఇదివరకే ఇద్దర్నీ హెచ్చరించాను. తేజ్‌.. నా బిడ్డలాంటి వాడు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగులకి హాజరవుతాడని ఆ భగవంతుణ్ణి, మా అమ్మను కూడా ప్రార్ధిస్తున్నాను.  నాలుగు రోజుల క్రితం కూడా వీరికి కౌన్సిలింగ్‌ చేద్దామని అనుకున్నాను. ఇద్దరూ మంచి వయసులో ఉన్నారు. పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు.. మంచి కెరీర్‌ ఉన్నవాళ్ళు. ఇలాంటి సమయంలో లైఫ్‌ రిస్క్‌లో పడేసుకోవడం మంచిదికాదు. సాయిని చూడటానికి ఆసుపత్రికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని రావట్లేదు. త్వరలో సాయి ధరమ్‌ తేజ్‌ని కలుసుకుంటాను’ అని నరేష్‌ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....