39 వ రోజు “ఫీడ్ ది నీడి” కార్యక్రమానికి మూసాపేట వాస్తవ్యులు గిరీష్ బాబు, సనత్ నగర్ గణపతి దేవాలయం అర్చకులు కీ శే కృష్ణమాచారి గారి పుత్రుడు వెంకటేష్ సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని అందించగా భాజపా హైదరాబాద్ కరోనా వారియర్స్ టీం సనత్ నగర్ సభ్యులు మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ మరియు ఆకూరి శ్రీనివాస్ రావు ల సమన్వయంతో యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు స్వామి టాకీస్ కాంప్లెక్స్ లేబర్ అడ్డా వద్ద నిర్వహించారు. నేటి కార్యక్రమానికి పటేల్ సౌండ్స్ యజమాని లక్ష్మణ్ పటేల్ ముఖ్య అతిథి గా విచ్చేసి దాతలు మరియు భాజపా సీనియర్ నాయకులు ఆకూరి శ్రీనివాస్ రావు, యేచన్ సురేష్, యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లతో కలిసి వలస కూలీలు, పేద ప్రజలకు ఆహార పొట్లాలు అందచేశారు. ఈ సందర్బంగా ఆకూరి శ్రీనివాస్ రావు, యేచన్ సురేష్ లు మాట్లాడుతూ పౌరులు సామాజిక బాధ్యతగా “ఫీడ్ ది నీడి” కార్యక్రమ నిర్వహణకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, విట్టల్ మురళి, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, భాజపా మహిళా నాయకురాలు సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, కార్తీక్ వారణాసి, బంటి, కిషోర్, ధర్మేంద్ర, భాను తదితరులు సహకారం అందించారు.
——————————
సామాజిక బాధ్యతగా “ఫీడ్ ది నీడి” కార్యక్రమం
సామాజిక బాధ్యతగా “ఫీడ్ ది నీడి” కార్యక్రమం