సామజిక మాధ్యమాల్లో ఘనంగా దత్తన్న జన్మదిన వేడుకలు

దత్తన్న తో పొలిమేర సంతోష్ (ఫైల్ ఫోటో)

హైదరాబాద్ జూన్ 11 ఇయ్యాల తెలంగాణ

భాజపా సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు,ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని సనత్ నగర్ బిజెపి నాయకులు సొషల్ మీడియా ద్వారా  ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆయనతో సాన్నిహిత్యంగా దిగిన ఫోటోలను సామజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర  బిజెపి పెద్దన్న కు ప్రత్యేక జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలిపారు. 

ఇందులో భాగంగా దళిత మోర్చా బిజెపి నాయకులు పొలిమేర సంతోష్ ఈ రోజు ఉదయం నుంచే దత్తన్న బర్త్ డే ను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆర్భాటాలు లేకుండా ఎవరికీ వారే నిరాడంబరంగా దత్తన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ పార్టీ కోసమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకు పటు పడ్డారని అయన పుట్టిన రోజు స్సందర్బముగా గుర్తు చేశారు. భగవంతుడు ఆయనకు మరింత ఆయురారోగ్యాలను ఆయుష్షును ప్రసాదించాలని జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్లు సంతోష్ తెలిపారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....