సాంకేతిక కళాశాల విద్యార్థుల పతకాల పంట

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ ): విశాఖ జిల్లా 56వ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సాంకేతిక విద్యార్థినీ విద్యార్థులకు బంగారు, రజత పతకాలు వరించాయి. విశాఖలోని వెలంపేట విజయాంధ్ర జిమ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో మోహన్‌ రాకేష్‌ బంగారు పతకం దక్కించుకున్నారు. అలాగే శ్యామల, శ్యామ్‌లు రజత పతకాలు దక్కాయి. ఈ సందర్భంగా జిమ్‌ కాలేజీ కోచ్‌ శివకుమార్‌ మాట్లాడుతూ శారీరకంగా దృఢంగా ఉంటేనే విద్యలోనే రాణించగలుగుతారన్నారు. అవార్డులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం సహకారంతోనే ఈ ఫలితాలను రాబట్టిగలిగామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....