సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది

ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ); ధన 51 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్‌’ చిత్రం చక్కని గుర్తింపు పొందింది. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. ‘రేసుగుర్రం’ చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంతగ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం ‘తంత్ర’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్‌  ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.నటీనటులు

అనన్య నాగళ్ల. ధనుష్‌, సలోని, టెంపర్‌ వంశీ, విూసాల లక్ష్మణ్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....