సర్కారు వారి పాట రిలీజ్‌ డేట్‌ మారిందా?

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’సర్కారు వారి పాట’. బ్యాంకింగ్‌ స్కామ్‌ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ తోనే అభిమానుల్ని  మెస్మరైజ్‌ చేసిన పరుశురామ్‌ .. ఈ సినిమాతో మహేశ్‌ కు అదిరిపోయే హిట్టివ్వాలని చూస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాటలు  ఓరేంజ్‌లో ఉండబోతు న్నాయట. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ’సర్కారువారి పాట’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. అయితే సంక్రాంతి రేసులో రాధేశ్యామ్‌, భీమ్లానాయక్‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌, లాంటి క్రేజీ మూవీస్‌ రిలీజ్‌ డేట్స్‌ లాక్‌ చేసుకున్నాయి. అందుకే సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమాను తప్పించి .. సమ్మర్‌ కానుకగా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నా రట.  ఈ సినిమాని ’పోకిరి’ రిలీజ్‌ డేట్‌ అయిన ఏప్రిల్‌ 28న విడుదల చేయబోతున్నట్టు  సమాచారం. ఇక అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ రావడమే తరువాయి అంటున్నారు. మరి నిజంగానే సర్కారువారి పాట సమ్మర్‌ రేస్‌ లోంచి తప్పుకుంటుందేమో చూడాలి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....