సఫాయ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : Krupadanam

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) : సఫాయ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సఫాయ్ కార్మిక  సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వేల్పుల కృపాధానం జాతీయ సఫాయ్ కర్మచారి కమీషన్ చైర్మేన్ వేంకటేశన్ కి విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. బుధవారం నాడు బేగంపేట లోని హోటల్ ప్లాజా లో నాల్గవ తరగతి కార్మికుల సమస్యలపై జరిగిన సమావేశంలో రెవెన్యూ , బ్యాంకింగ్ వివిధ శాఖల కార్మికుల సంఘ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సఫాయ్ కార్మిక సంఘం అధ్యక్షుడు క్రృపాధానం మాట్లాడుతూ గొంతెమ్మ కోర్కెలు కాని మా సఫాయ్ కార్మికుల సమస్యలను, న్యాయమైన డిమాండ్లను  పరీష్కరించాలని విజ్ఞప్తి చేయగా జాతీయ కమీషన్ చైర్మైన్ వేంకటేశన్ సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. త్వరలోనే జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్  తో సమావేశం ఏర్పాటుచేసి సఫాయ్ కార్మికుల డిమాండ్లను పరీష్కరిస్తామని వెంకటేశన్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గాంధీ, చిత్తారీ, జి యాదగిరి అంజయ్య, వేంకటేశ్, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....