సఫాయ్ కర్మచారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : Telangana సఫాయ్ కార్మికుల సంఘం

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) :  సఫాయ్ కర్మచారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ సఫాయ్ కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వేల్పుల కృపాధానం అన్నారు. ఈ నెల 21 వ తేదీన పలువురు కార్మిక నాయకులతో కలసి సంతోష్ నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటి కమీషనర్ శివకుమార్ ని కలసి సఫాయ్ కార్మికుల సమస్యలను, డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేల్పుల కృపాధానం మాట్లాడుతూ గత ప్రభుత్వం సఫాయ్ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, సమస్యల పరిష్కారాలు సమాయానికి  జరగనందువల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమీషనర్ తో తమ ఆవేదనను వ్యక్తపరచినట్లు తెలిపారు. కమీషనర్ శివకుమార్ కూడా నగర కమిషనర్ తో త్వరలోనే కలసి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు కృపాధానం తెలిపారు. అనంతరం కృపాధానం నాయక బృందం కలసి కమీషనర్ శివకుమార్ కి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాండు  షేక్ ఖదీర్  నర్సింగ్ రావ్ ఇబ్రహిం  క్రిష్ణా అశోక్  యాదవ్ సురేందర్ జ్ఞానేశ్వర్  తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....