సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి వివాదాస్పద పోస్టు

చెన్నై సెప్టెంబర్‌ 11 (ఇయ్యాల తెలంగాణ ); తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్‌ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్టాలిన్‌ సోషల్‌ విూడియాలో ఓ పోస్టు పెట్టాడు.దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్‌ ఫొటోను ఉదయనిధి స్టాలిన్‌ పోస్ట్‌ చేశాడు. అయితే దీనికి ఎటువంటి క్యాప్షన్‌ ఇవ్వలేదు. ఇక ఈ ఫొటో ‘సనాతన ధర్మం’ (పై స్టాలిన్‌ చేసిన డెంగీ, మలేరియా వ్యాఖ్యలను గుర్తుకుతెస్తుంది. కాగా.. ఈ ఫొటోపై నెటిజెన్లు స్పందిస్తూ.. విమర్శలను ఎలా స్వీకరించాలో, సంఫీులను ఎలా ఇబ్బంది పెట్టాలో ఉదయనిధి స్టాలిన్‌కు బాగా తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....