సనత్ నగర్ బిజెపి పరివార్ తరఫున సీనియర్ సిటిజన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి బూస్టర్ డోస్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకారంతో షెడ్డు నిర్మాణం

హైదరాబాద్, జనవరి 19 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ బిజెపి పరివార్ తరఫున సీనియర్ సిటిజన్ మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి బూస్టర్ డోస్ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రేఖ చంద్రిక  వారి సిబ్బంది సమక్షంలో వాక్సినేషన్ కొనసాగించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు భౌతిక దూరం తో పాటు మాస్కు  పెట్టుకోవడం  తప్పనిస రిగా అలవాటు చేసుకోవాలన్నారు. వాక్సినేషన్ కోసం ప్రతి ఒకారు ముందుకు రావాలని సూచించారు. సనత్ నగర్ ప్రాంతంలో కేంద్ర మంత్రి  గంగాపురం కిషన్ రెడ్డి ద్వారా ఎంపీల లార్డ్స్ వారికి నిధుల  సుమారుగా 9 లక్షలు సనత్ నగర్ లోని షెడ్ కి  మంజూరు చేయడం జరిగిందని ఇంకో షెడ్ నిర్మాణానికి 11 లక్షలునిధులు విడుదల చేయించి పనికి శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకులు  పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో దిశా కమిటీ సభ్యులు పి చరణ్ సింగ్ తో పాటు బిజెపి ఓబీసీ మోర్చా యేచన్ సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్ల జైహింద్ గౌడ్,  సీనియర్ బిజెపి నాయకులు ఆకోరి శ్రీనివాసరావు,  ఉత్తమ్ కుమార్, దళితరత్న పొలిమేర సంతోష్ కుమార్,  వైయస్ రావు, సివి శ్రీనివాస్ రావు, లక్ష్మణ్ సుధాకర్, అదేవిధంగా  బిజెపి కార్యకర్తలు పాల్గొని కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు.  ఈ నెల 19 వ తేదీన షెడ్డు నిర్మాణం కార్యక్రమం మొదలవుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి   అభివృద్ధి కార్యక్రమాలకు వెంటనే స్పందించినందుకు ప్రత్యేకంగా సనత్ నగర్  బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....