సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన P V

న్యూఢల్లీ 28 (ఇయ్యాల తెలంగాణ ) 2024 సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢల్లీిలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పి.వి. చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి రెడ్డి పి.వి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....