సంక్షేమం అందించిన జగన్‌ పార్టీ ఓడిపోవ్వడం ఏంటి.? KTR

హైదరాబాద్‌ జులై 10 (ఇయ్యాల తెలంగాణ ):ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ఓటమిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక కామెంట్స్‌ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్జగన్‌ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైఎస్‌ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢల్లీిలో కేటీఆర్‌ విూడియా చిట్చాట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. పవన్కల్యాణ్‌ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. వైఎస్జగన్ను ఓడిరచేందుకు షర్మిలను పావులా ఉపయోగించారన్నారు. అంతకు మించి షర్మిల ఏవిూ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....