హైదరాబాద్ జులై 08 (ఇయ్యాల తెలంగాణ ):గాంధీభవన్ వైఎస్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగపడుతోంది. దేశంలో సంక్షేమం అంటే గుర్తు వచ్చే పేరు వైఎస్‌ఆర్. దేశంలోని అన్ని రాజకీయ పార్టీ లు, నాయకులు వైఎస్ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకొని అమలు చేస్తున్నారు. సంక్షేమంపై వైఎస్‌ఆర్ ముద్ర ఎంతో ఉంది. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లకు స్ఫూర్తి వైఎస్‌ఆర్ ఆనాడు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి కృష్ణా జలాలు, హైదరాబాద్ లో పెట్టుబడుల కు కూడా వైఎస్సే స్ఫూర్తి. వైఎస్ స్ఫూర్తి ని మా ప్రభుత్వం, పార్టీ కొనసాగుతుంది. 2009 లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాంధీ ని ప్రధాని కావాలన్నదే లక్ష్యం అని వైఎస్ చెప్పిన మాటలు గుర్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని కాకుండానే వైఎస్ మనకు దూరం అయ్యాడు. వైఎస్ స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్ ని ప్రధాని చేయాలి. వైఎస్ ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్ర నే భారత్ జోడో యాత్రకు స్పూర్తి. ఆ నాడు వైఎస్ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చింది. రాహుల్ పాదయాత్ర తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చిందని అన్నారురాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా రాణిస్తుంటే దేశ ప్రధాని పదవికి ఆయన ఒక అడుగు దూరంలో ఉన్నాడనిపిస్తోంది. రాహుల్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వైఎస్ 75 వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు రాహుల్ ప్రధాని కావాలన్న ప్రతిజ్న తీసుకోవాలి. రాహుల్ గాంధీ కి పదవులు ముఖ్యం కాదు. అనుకుంటే 2004 నుంచి 2014 మధ్య లో పీఎం అయ్యేవారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ప్రస్తుతం దేశానికి ఉంది. రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడానికి ఎవరైతే పూనుకుంటారో వారే నిజమైన వైఎస్‌ఆర్ అభిమానులు. వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ లోకి రావాలి. 2021 జూలై 7 న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. మూడేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం … పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసిన 35 మంది నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని అన్నారు. ఎలాంటి ఫైరవీలు లేకుండా పార్టీ కోసం పని చేసిన, త్యాగం చేసిన వారికి పదవులు ఇచ్చాం. కష్టపడిన కార్యకర్తలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నదే మా ఉద్దేశం. కార్యకర్తలను కాపాడుకున్నపుడే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు. .
- Homepage
- iyyala telangana
- సంక్షేమంపై YSR ముద్ర రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి CM రేవంత్ రెడ్డి
సంక్షేమంపై YSR ముద్ర రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి CM రేవంత్ రెడ్డి
Leave a Comment