షాపూర్‌ లో కూలిన భారీ క్రేన్‌

  

ముంబై, ఆగస్టు 1, (ఇయ్యాల తెలంగాణ ): 16 మంది మృతి

మహారాష్ట్రలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్‌?లో.. భారీ క్రేన్‌? (గర్డర్‌?) ఒక్కసారిగా కుప్పకూలి 16 మంది మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వంతెనలు తయారు చేసేందుకు వాడే ఉపయోగించే గడ్డర్‌ క్రేన్‌ కులిపోవడంతో ప్రమాదం జరిగింది.  సంవృద్ధి ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మిణంలో భాగంగా మూడో దశ పనులు జరుగుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థంలో మరో ఐదుగురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.దీనిపై అధికారులు వివరాలు వెల్లడిరచారు. ‘షాపూర్‌?లోని సర్లంబె గ్రామానికి సవిూపంలోని గర్డర్‌? కూలి 16 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సంవృద్ధి ఎక్స్‌?ప్రెస్‌?వే? మూడో ఫేజ్‌? పనులు జరుగుతుండా.. ఈ ఘటన చోటుచేసుకుంది. గర్డర్‌ను ఆపరేట్‌? చేస్తుండగా.. అది ఒక్కసారిగా కుప్పకూలింది. 16 మంది చనిపోయారు’ అని వెల్లడిరచారు.భారీ నిర్మణాల్లో గడ్డర్లను ఉపయోగిస్తారు. భారీ ఇనుప? రాడ్లు, బీమ్‌లను కదిపేందుకు వీటిని వాడుతుంటారు. హైవే నిర్మాణాలు, రైల్వే బ్రిడ్‌లను రూపొందించడం వీటి పాత్ర కీలకంగా ఉంటుంది. షాపూర్‌?లోని సర్లంబె గ్రామానికి సవిూపంలో  సంవృద్ధి ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మిణంలో వీటిని ఉపయోగిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూలీలు పనిచేసుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీనిపై ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రకటన విడుదల చేసింది. ‘మొత్తం 16 మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు శిథిలాల్లో చిక్కుకున్నారు.’ అని తెలిపింది.తాము గడ్డర్‌కు మరో వైపు పనిచేస్తున్నామని, ఘటన జరిగిన సమయంలో అక్కడ 30 మంది వరకూ పనిచేస్తున్నారని, వారిలో చాలా మందికి బలమైన గాయాలు అయ్యాయని, కాళ్లు, చేతులు, తలపై దెబ్బలు తగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంవృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవేని ముంబై` నాగ్‌?పూర్‌? ఎక్స్‌ప్రెస్‌ వే అని కూడా పిలుస్తుంటరు. రెండు నగరాలను కలిపేందుకు ఇది కీలకంగా మారనుంది. నాగ్‌పూర్‌?`షిరిడీని కలుపుతూ గత ఏడాది తొలి దశ రోడ్డు నిర్మాణం పూర్తయింది.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోడ్డును ప్రారంభించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....