హైదరాబాద్,మార్చి 4 (ఇయ్యాల తెలంగాణ) : సంత్ శీరోమణి శ్రీ గురు రవిదాస్ మహరాజ్ 645వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని హైదరాబాద్ సంగర జాతి సంఘ్ అధ్యక్షులు జితేందర్ మంగోల్ కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సమగర జాతి సంఘ్ ఆధ్వర్యంలో సంత్ శీరోమణి శ్రీ గురు రవిదాస్ మహరాజ్ 645వ జయంతి ఉత్సవాలను ఈ నెల 5వ తేది శనివారం ఉదయం 9:30ని”లకు బొగ్గుల కుంట తిలక్ రోడ్ లోని సారస్వత పరిషత్ ట్రస్ట్ భవన్ లో నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సమగర జాతి సంఘ్ అధ్యక్షుడు జితేందర్ మంగోల్కర్ తెలిపారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా రవిదాసియ ధర్మ సంఘటన్ జాతీయ అధ్యక్షుడు సుఖ్ దేవ్ మహారాజ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్ఏ రాజాసింగ్, మాజీ ఎంపి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఎస్. గంగారాం, తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ప్రతి గురు రవిదాస్ భక్తులకు విజ్ఞప్తి చేశారు నిర్వాహకులు జితేందర్ మంగోల్కర్, ప్రధాన కార్యదర్శి మున్నాలాల్ ఖోఖా ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
- Homepage
- General News
- శ్రీ గురు రవిదాస్ మహరాజ్ 645వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి
శ్రీ గురు రవిదాస్ మహరాజ్ 645వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి
Leave a Comment