శ్రీశ్రీశ్రీ గాలిపోచమ్మ దేవాలయంలో Bonala వేడుకలు 27 నుంచి 29 వరకు

 హైదరాబాద్, జులై 25 (ఇయ్యాల తెలంగాణ) శ్రీ శ్రీ శ్రీ గాలిపోచమ్మ దేవాలయం, అంబికా నగర్ 9 వ వార్షికోత్సవ వేడుకలు జూలై 27 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు ఘనంగా కొనసాగుతాయని అధ్యక్షులు రాజపాగ అర్జున్ తెలిపారు. ప్రతి ఏటా ఆషాడ మాసం బోనాల వేడుకలు ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాస్, గడ్డి మధుసూదన్, కుల్ప గిరి నాగేశ్వర్, పుట్ట దయాకర్ యాదవ్,ప్రధాన కార్యదర్శులు ఠాకూర్ సంజీవ్ సింగ్, ఆర్. సత్యనారాయణ యాదవ్, కోశాధికారి జంగం ఈశ్వర్ సహాయ కార్యదర్శులు ఆర్. శివ కుమార్ (డల్లు), వై. నర్సింగ్ రావు, కార్య నిర్వాహక కార్యదర్శులు కోలేకర్ వినోద్, కె. దుర్గేష్, మనీష్, కారూరి మదన్, సలహా దారులు పి. రాజు యాదవ్, మామిడి కృష్ణ , వై. బాబు రావు కార్య వర్గ సభ్యులు గడ్డి అనురాధ, కె. అనురాధ,కె.యాదయ్య, పి. పండు రావు, ఎన్. ఆనంద్ చారి,  ఎన్.లక్ష్మయ్య, ఎం. శివ, టి. సంతోష్ రాణి, సుగుణ ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....