శ్రీశైలంలో గురుపౌర్ణమి వేడుకలు

 శ్రీశైలం జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):గురుపౌర్ణమి పర్వదినాన్ని పుస్కరించుకుని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి, హెమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి స్వామికి, వ్యాసమహర్షి కి విశేష పూజలను ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు పూజా సంకల్పాన్ని పఠించి తరువాత మహాగణపతి పూజా చేశారు. అనంతరం దక్షిణామూర్తి మరియు వ్యాసమహర్షి చిత్రపటాలకి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం అర్చకులు, వేదపండితులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....