శ్రీవారి భక్తులకు శుభవార్త

బుధవారం నుంచి సర్వదర్శనం టిక్కట్ల జారీ

తిరుమల,సెప్టెంబర్‌7(ఇయ్యాల తెలంగాణ):  శ్రీ వారి భక్తులకు టీటీడీ ఆలయ కమిటీ తీపి కబురు అందించింది. సర్వ దర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 8 వ తేదీ బుధవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద రోజుకి 2 వేల చోప్పున టోకెన్లు జారీ చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసుల కు టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టిటిడి పాలక కమిటీ. సర్వ దర్శనం టోకెన్ల జారీ తో భక్తులకు కాస్త ఊరట లభించనుంది. కాగా కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రోజులుగా సర్వదర్శనం టోకెన్ల జారీ ని టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్‌ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్నయం తీసుకుంది టీటీడీ పాలక కమిటీ. ఈ నెల 13 నుంచి తిరుమలలో అగరబత్తీలు భక్తులకు అందుబాటు లోకి వస్తాయని..  టీటీడీ పాలక కమిటీ చెప్పింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....