మంథని ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ );మంథని శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ముత్తారం మండలం చెందిన పలువురు చేరారు. వీరికి ఏఐసీసీ సెక్రెటరీ ,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుచొప్పరి సదానందం,ముత్తారం మండలం అధ్యక్షులు దొడ్డ బాలాజీ,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య ల ఆధ్వర్యంలో ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన యాదవ సంఘం అధ్యక్షులు జంగా సమ్మయ్య యాదవ్,ముదిరాజ్ సంఘం చైర్మన్ మూగ సంపత్ ,ముదిరాజ్ సంఘం వైస్ చైర్మన్‌కలవేన సదయ్య ,ముదిరాజ్ సంఘం కార్యదర్శి అలవేన తిరుపతి, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూగ రాజేశం ,కుక్కల మల్లేష్, తుమ్మల శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ చైర్మన్‌పాండవుల స్వామి లతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ కి చెందిన 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తూటీ రజిత రఫీ, బియ్యని శివకుమార్,వాజిద్ పాషా,అల్లం కుమారస్వామి, గాదం శ్రీనివాస్,బక్కతట్ల కుమార్,కోల విజయ్,వార్డు సభ్యులు ఆకోజు అశోక్,మూగ రజిత రవీందర్,బోనగాని రమేష్,తుమ్మల లక్ష్మి సదానందం,సీనియర్ నాయకులు చొప్పరి రాజాలు, చొప్పరి సదయ్య,తోడేటి శశి కుమార్,మండల రమేష్,దాసరి చంద్రమౌళి,తీగల సత్యనారాయణరావు,నరేడ్ల సదానందం,రత్న కొమురయ్య, బోయిని రాజనర్సయ్య,సుధాటి సంపత్ రావు,ఎండి రజాక్,రత్న రవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- General News
- శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Leave a Comment