శివలింగంపై సైంటిఫిక్‌ సర్వే

  

లక్నో, జూలై 24, (ఇయ్యాల తెలంగాణ )వారణాసిలోని ప్రఖ్యాత జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులో సైంటిఫిక్‌ సర్వే చేయించాలన్న హిందూ సంఘాల తరపు న్యాయవాదుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు అందుకు తగినట్లుగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు.సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ సేకరించే పనులను మొదలుపెట్టారు. కాశీలో విశ్వనాధుడి ఆలయాన్ని ఆనుకుని ఉండే ఈ మసీదు హిందూ దేవాలయమని హిందువులు, కాదు ఇది మసీదు మహమ్మదీయుల మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. గతంలోనూ కోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే చేపట్టగా ఓ శివలింగం లాటి ఆకృతి మసీదులో వెలుగు చూసింది. అయితే అది శివలింగం కాదని వాటర్‌ ఫౌంటేన్‌ అని ఇస్లాం మత పెద్దలు కోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు..ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా తో సైంటిఫిక్‌ సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేయటంతో ఈ రోజు అధికారులు సర్వే మొదలు పెట్టారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....