‘శివం భజే’ కి నైజాం ఏరియాలో Grand రిలీజ్‌!

 గంగా ఎంటర్టైన్మెంట్స్‌ ‘శివం భజే’ కి నైజాం ఏరియాలో గ్రాండ్‌ రిలీజ్‌ ఇవ్వనున్న మైత్రి మూవీ మేకర్స్‌ ఎల్‌. ఎల్‌. పి!!

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్‌ ‘శివం భజే’ చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్‌ గా రిలీజ్‌ చేయనున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్‌’.ఇటీవల విడుదలైన పాటలకి, ట్రైలర్‌ కి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుండడంతో మార్కెట్‌ లో అంచనాలు భారీగా పెరిగాయి.దాంతో నైజాం ఏరియాలో గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్‌ ఎల్‌. ఎల్‌. పి లాంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది.ట్రైలర్‌ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్‌ క్రైమ్‌, మర్డర్‌ మిస్టరీ, సీక్రెట్‌ ఏజెంట్‌, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్‌ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమైంది. వికాస్‌ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్‌, హీరో అశ్విన్‌ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మాణ విలువలు, అప్సర్‌ దర్శకత్వం ఇలా ఎన్నో హైలెట్స్‌ తో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్‌ డివైన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంలో అశ్విన్‌ సరసన, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌ గా నటించారు.

అర్బాజ్‌ ఖాన్‌, దిగంగనా సూర్యవంశీ, హైపర్‌ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్‌, అయ్యప్ప శర్మ, శకలక శంకర్‌, కాశీవిశ్వనాధ్‌, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....