వైభవోపేతంగా కొనసాగుతున్న ఉజ్జయిని మహాకాళి Bonalu !

 

సికింద్రాబాద్, జులై 21 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహాకాళి మాత  బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. మమ్ములను, మా పిల్ల పాపలను చల్లంగా చూడు మహాకాళి మాత అంటూ వేడుకున్నారు. అనేక మంది ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు  దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ విభాగాల అధికారులు విశిష్ట సేవలను అందించారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....