వెంకట్ రావు స్మారకోన్నత పాఠశాలలో జాతీయ పతాక పండుగ

హైద్రాబాద్,ఆగస్ట్ 16 (ఇయ్యాల తెలంగాణ) : ఎందరో త్యాగమూర్తుల ప్రాణాలను  ఫణంగా పెట్టి సాధించిన స్వాతంత్య్రాన్ని నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీలుస్తు న్నామని వెంకట్ రావు స్మారకోన్నత పాఠశాల కరాస్పాండెంట్ పసునూరి బ్రహ్మానందచారి అన్నారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటరావ్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,బ్రిటిషు సామ్రాజ్యవాదుల అకృత్యాలకు భయపడక ప్రాణాలను త్యజించారని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించాలని చెప్పారు. స్వాతంత్రం  మన జన్మహక్కని నినందించారని తూఠాల దెబ్బలకు అసువులు బాసారని వారి ధైర్యసాహసాలను నెమరువేసుకోవాలని సెక్రటరీ ప్రసాదరావు ఉద్ఘాటించారు.దీనికి ముందుగా బ్రహ్మాంనంద చారి జాతీయ జండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మల్లిఖార్జున్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేణు,టీచర్లు సురేష్, వాణీ లత,వెంకటరమణ, మురళి విద్యానంద్, సూర్యదేవ్ లు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....