విశ్వ హిందూ పరిషత్‌ నిరసన ప్రదర్శనలకు సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢల్లీ  ఆగస్ట్‌2 (ఇయ్యాల తెలంగాణ ):  హర్యానాలోని నుప్‌ా జిల్లాలో జరిగిన మత ఘర్షణలను నిరసిస్తూ ఢల్లీి నగరంలో నిరసన ప్రదర్శనలను నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నగరంలో జరిగే ప్రదర్శనలలో విద్వేష ప్రసంగాలు, హింసాత్మక సంఘటనలు లేకుండా జాగ్రత్త వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నిరసన ప్రదర్శనలను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీ భట్టి ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.ఈ పిటిషన్‌ను జర్నలిస్ట్‌ షహీన్‌ అబ్దుల్లా దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ సీయూ సింగ్‌ వాదనలు వినిపించారు. దేశ రాజధాని నగరం ఢల్లీిలో 23 చోట్ల నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ ప్రకటించాయని తెలిపారు. ఈ ప్రదర్శనలను నిలిపేయాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు 

తీర్పు చెప్తూ, ఈ నిరసన ప్రదర్శనలను నిలిపేసేందుకు నిరాకరించింది. ఈ ప్రదర్శనల్లో విద్వేష ప్రసంగాలు చేయకుండా, హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢల్లీిలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, తదుపరి విచారణ ఈ నెల 4న జరుగుతుందని తెలిపింది.హర్యానాలోని నుప్‌ా జిల్లాలో వీహెచ్‌పీ తదితర సంస్థలు నిర్వహించిన జలాభిషేక యాత్రను జూలై 31న ఓ వర్గం వారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వందలాది మంది దుండగులు ఈ యాత్రపైకి దాడి చేసి, రాళ్లు రువ్వారు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, వాహనాలను తగులబెట్టారు. పోలీస్‌ స్టేషన్‌ గోడను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 116 మంది గాయపడ్డారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌, హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఆరోపించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....