విశ్వ కర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దానం

విశ్వ కర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దానం


విశ్వ కర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబర్ పెట్ లో  రక్త దానం చేస్తున్న  దృశ్యం

హైదరాబాద్ మే 16 (ఇయ్యాల తెలంగాణ)  లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు అనేక మంది  ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దీనికి తోడు ఇలాంటి సమయంలో రక్తం అవసరమైన కొందరు పేషంట్లకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తున్నదని విశ్వ కర్మ  ఫౌండషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులు సకాలంలో రక్తం అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్బంగా విశ్వ కర్మ ఫౌండేషన్ అంబర్ పెట్  వారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు 100 మంది రక్త దానం చేశారు. తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల కోసం రక్త దానం ఏర్పాటు చేశామని సంఘం సభ్యులు తెలియ జేశారు. విశ్వ కర్మలను కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా నగర భాజపా మాజీ అధ్యక్షులు బి. వెంకట్ రెడ్డి విశ్వ కర్మ అధ్యక్షులు కందారాం గణేష్  చారి బిజెపి నగర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, అజయ్ కుమార్, కంచె చంద్ర శేఖర్, శ్రీనివాస్ ముదిరాజ్, రవీందర్ గౌడ్,నాగ భూషణ్ చారి,సంజీవ చారి, సంఘం సభ్యులు నాగరాజు చారి, వేణు గోపాల్ చారి, అనిల్ చారి, సదానంద్ చారి,ప్రభాకర్ చారి,సతీష్ చారి, ఉత్తమ్ చారి,రాజు చారి,బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....