విమాన ప్రమాదంలో రష్యా తిరుగుబాటు నేత ప్రిగోజిన్‌ తోపాటు మరో 9 మంది మృతి


న్యూ డిల్లీ ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):రష్యా తిరుగుబాటు నేత ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే ఆ విమాన ఘటనకు చెందిన కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. గింగిరాలు తిరుగుతూ ఆ విమానం నేలకూలింది. ఆ తర్వాత భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు చెందిన వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తున్నాయి.మాస్కో: రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ మిలిటరీ కంపెనీకి చెందిన చీఫ్‌ ఎవజెనీ ప్రిగోజిన్ప్రయాణిస్తున్న నేలకూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రిగోజిన్‌తో పాటు మరో 9 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. రష్యాలోని తేవర్‌ ప్రాంతంలో ఆ విమానం కూలింది. మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. కేవలం 30 సెకన్లలో ఆ విమానం 8 వేల ఫీట్ల కిందకు పడిపోయింది. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడు మంది ప్యాసింజెర్లు ఉన్నారు. అందరూ మృతిచెందినట్లు టాస్‌ ఏజెన్సీ తెలిపింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....