విమానాలకు భారీగా డిమాండ్‌…

న్యూఢల్లీ, జూలై 18, (ఇయ్యాల తెలంగాణ ): దేశంలో ప్రత్యేక విమానాల అవసరం విపరీతంగా పెరిగింది మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాలు వాడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రత్యేక విమానాలు లేకుండా అడుగు కూడా బయట పెట్టడం లేదు. రెండు రోజులపాటు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష నాయకుల సమావేశాల్లో పాల్గొన్న నేతలు సైతం అందరూ ప్రత్యేక విమానాల్లోనే బెంగళూరు చేరుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు ఊంఒ ఎయిర్పోర్ట్‌ ప్రత్యేక విమానాలతో కళకళలాడుతూ ఉంది. బెంగళూరులో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన నాయకులు ఎవరెవరు ప్రత్యేక ఫ్లైట్లో వచ్చారంటూ కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే బాసన్న గౌడ్‌ పాటిల్‌ లిస్ట్‌ ను బయట పెట్టారు.ప్రత్యేక విమానాల్లో వచ్చిన వారి జాబితాలో కాంగ్రెస్‌ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నితీష్‌ కుమార్‌, హేమంత్‌ సోరేన్‌, మమతా బెనర్జీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌, శరద్‌ పవార్‌, జితేంద్ర అవద్‌, సుప్రియ సులే, సిద్దేశ్వర సింఫి, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉద్ధవ్‌ థాక్రే, అఖిలేష్‌ యాదవ్‌ తో పాటు మరికొంతమంది ప్రత్యేక విమానాల్లో వచ్చారు. అయితే కొంతమంది కలిసి ఒకే స్పెషల్‌ ఫ్లైట్‌ లో వస్తే కొంతమంది మాత్రం విడివిడిగా ఎవరి స్పెషల్‌ రైతుల వారు వచ్చారు. అయితే ఒక రాజకీయ కార్యక్రమం కోసం విూరందరికి స్పెషల్‌ ఫ్లైట్‌ ఏర్పాటుచేసి బెంగళూరు రప్పించడంపై బీజేపీ ఎమ్మెల్యే బసన్న గౌడ పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరందరికీ విభిన్నంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం సాదాసీదాగా అందరితో కలిసి రెగ్యులర్‌ ఫ్లైట్‌ లో వచ్చారు. అయితే ఢల్లీిలో జరుగుతున్న ఎన్డీఏ పక్ష సమావేశానికి కూడా చాలామంది స్పెషల్‌ ఫ్లైట్లోనే ఢల్లీి చేరుకున్నారు కాకపోతే ఆ జాబితాను విడుదల చేయలేదు అంటూ సోషల్‌ విూడియాలో వాదనలు జర్గుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....