విద్యుత్ ఉద్యోగులను కూడా గుర్తించాలి
లాక్ డౌన్ సమయాన వారి సేవలు విలువైనవే ?
హైదరాబాద్ మే 14 ( ఇయ్యాల తెలంగాణ ) కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జన జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. కాని కరోనా తో భయపడి అందరు లాక్ డౌన్ లో ఉంటె కొందరు మాత్రం కరోనాతోనే నిత్యం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిత్యా జీవితంలో వాళ్ళ సేవలు లేకుంటే మనుషుల మనుగడకే ప్రమాదం ఏర్పడుతోంది. అలాగే నిత్యం సేవలందిస్తోన్న వైద్య రంగం, పారిశుద్ధ రంగం తో పోలీసు శాఖ ఉన్నది. కాగా అసలు అందరికి విద్యుతు అందేలా చూస్తున్న విద్యుతు కార్మికులను మాత్రం అందరూ విస్మరిస్తున్నారని ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులికంటి నరేష్, ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు పని చేయాలన్న ఆసుపత్రుల్లో విద్యుత్తు ఏంతో అవసరమని గుర్తు చేశారు.
అసలు విద్యుత్తు నిలిచి పొతే మనమంతా ఉండగలమా ? అంటూ వాపోయారు. లాక్ డౌన్ సమయంలో వివిధ రంగాల సేవలను గుర్తిస్తున్న ప్రభుత్ర్వాలు, ప్రజలు విద్యుత్ కార్మికుల సేవలను మాత్రం ఎవరు గుర్తిచడం లేదన్నారు.కాబట్టి వాళ్ళ సేవలను కూడా మనం ప్రస్తుతం పరిగణలోకి తీసుకోవాలని SC డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పులికంటి నరేష్, కోరారు. ముఖ్యముగా పాత నగరంలోని పతే నగర్ ప్రజలకు ఈ విదంగా సూచించారు దయచేసి అందరు తమ తమ నివాసంలో ఉండాలని అత్యవసర పరిస్థితి తప్ప ఎట్టి పరిస్థితిల లో బయటకి వెళ్లకూడదని తెలిపారు, నిన్న జియాగూడలో జరిగిన సంఘటనను చుస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుందని కావున దయచేసి వారివారి ఇళ్లలో నే ఉండాలని తమ తమ కుటుంబాలతో సురక్షితంగా ఇంట్లోనే గడపాలని, లాక్ డౌన్ ను అందరు పాటించాలని కోరారు. , ప్రభుత్వానికి ప్రతివారు సహకరించాలని, పోలీస్ లకు, పరిశుద్ధ కార్మికులకు, డాక్టర్ లకు, ప్రత్యేకంగా విద్యుత్ కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎందుకంటే లక్డౌన్ నాటినుండి ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా విద్యుత్ వ్యవస్థ నిలిచి పోకుండా నిరంతరం వారు కృషి చేస్తూనేవున్నారని చెప్పారు. కావున ప్రభుత్వం వారిని కూడా గుర్తుంచాలని పులికంటి నరేష్ ప్రభుత్వని కొరారు.