విద్యా సంస్థల కు బంద్‌ కు పిలుపు KG నుండి PG వరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌

కౌతాళం జులై 4 (ఇయ్యాల తెలంగాణ ):మండల కేంద్రం  లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజి లో బుధవారం పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడు కె.మంజునాథ్‌ ఏఐఎస్‌ఎఫ్‌ మండల కార్యదర్శి గురు బాసవరాజు  మాట్లాడుతూ నీట్‌ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారని నీట్‌ పేద విద్యార్థుల కోసం కాదు. ఉన్నంత వర్గాల కోసం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని ఇలా అయితే పేద విద్యార్థులు నీట్‌ పై నమ్మకాన్ని కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇటీవలే నీట్‌ .నెట్‌ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.పి.హెచ్‌.డి అడ్మిషన్ల కోసం ఇటువలె ఆమోదించిన తప్పనిసరి నెట్‌ స్కోర్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. పాఠశాలల మూసివేతను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు వారు డిమాండ్‌ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలలు యజమాన్యం ప్రిన్సిపాల్‌ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఈ బంద్‌ కు స్వచ్ఛందంగా సహకరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ మండల ఉపాధ్యక్షుడు మహేష్‌.సాయివర్మ   ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కుమార్‌ గంగారాం ఖాదర్‌  తదితరులు పాల్గొన్నాం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....