విజయపురి కాలని వాసులకు ఇబ్బంది కలిగించకండి : పద్మారావు

రైల్వే అధికారులకు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని విజయపురి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాశారు. సోమవారం నాడు  రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, ఇతర అధికారులకు సూచనలిస్తూ లేఖలు అందజేశారు. విజయపురి కాలని నుంచి లాలాగూడ వైపు వెళ్ళే మార్గాన్ని రైల్వే అధికారులు ముసివేసిన్ నేపధ్యంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు  పద్మారావు గౌడ్ తో సమావేశమై వివిధ అంశాల పై వినతి పత్రాన్ని అందించారు.దీనికి స్పందించిన పద్మారావు  వెంటనే రైల్వే అధికారులకు లేఖలు పంపారు.  రైల్వే స్థలాలను పరిరక్షించు కోవడంలో తాము కుడా సహకరిస్తామని, అయితే స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రహరీ గోడలు నిర్మించి, అప్ప్రోచ్ రోడ్డును మూసివేయడం సరికాదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. స్థానికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.  కొత్తగా ఏర్పాటు చేసుకున్న ప్రహరీ గోడ గేటును వాహనాల రాకపోకలకు వీలుగా తెరిచి ఉంచాలని లేఖలో కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....